Breaking News

పోలీసు విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్


Published on: 15 May 2025 18:53  IST

తనపై నమోదైన కేసు విషయంలో నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాలని నటుడికి పోలీసులు సూచించారు. శ్రీనివాస్‌ కారును సీజ్‌ చేసి, నోటీసులు ఇచ్చి పంపారు. బెల్లకొండ శ్రీనివాస్‌ ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్‌ రూట్‌లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆయనపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి