Breaking News

సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక..


Published on: 09 Feb 2026 12:57  IST

సైబర్ నేరగాళ్ల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మూడు రోజులుగా సాగుతున్న మానసిక వేధింపులను తట్టుకోలేక ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.మృతుడు రామారావు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం, సైబర్ నేరగాళ్లు ఆయన ఫోన్‌ను హ్యాక్ చేశారు.  మానసిక ఒత్తిడికి గురిచేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు భరించలేక రామారావు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement