Breaking News

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం


Published on: 09 Feb 2026 15:17  IST

ఓ మహిళా కానిస్టేబుల్‌ పోలీసుస్టేషన్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్‌ నల్లిపోగు జ్యోతి ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సహచర పోలీసులు వెంటనే వింజమూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొంది ఇంటికి వచ్చిన జ్యోతి విలేకరులతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకటరావు వేధింపుల వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి