Breaking News

పిల్లల పాలిట మృత్యువుగా మారుతున్న పతంగులు..


Published on: 09 Feb 2026 19:08  IST

సరదాగా గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై పడి 10 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బల్డింగ్‌పై పతంగి ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు టెరస్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. సాయిబాబా నగర్‌లో ఉంటున్న హేమంత్ అనే 10 ఏళ్ల బాలుడు సోమవారం ఉదయం సరదాగా ఇంటి బిల్డింగ్‌పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తున్నాడు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి టెరస్ పై నుంచి పడిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి