Breaking News

విశాఖలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోదం


Published on: 10 Feb 2026 16:45  IST

విశాఖ నగరంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. మంగళవారం ఆయనతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వైజాగ్, విజయవాడల లో మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం..మెట్రో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి