Breaking News

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు..


Published on: 10 Feb 2026 17:03  IST

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు రట్టు చేశారు. చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో.. పాల వ్యాన్‌లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తిరుపతి నుంచి కర్ణాటకకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. బియ్యంతో సహా వాహనాన్నీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి