Breaking News

మంత్రి కందుల దుర్గేష్‌కు బెదిరింపు లేఖ.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ.మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామంటూ ఈ లేఖలో తీవ్ర హెచ్చరికలు చేశారు.


Published on: 11 Feb 2026 10:28  IST

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ.మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామంటూ ఈ లేఖలో తీవ్ర హెచ్చరికలు చేశారు.వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న మంత్రి కార్యాలయానికి (పేషీ) పోస్టు ద్వారా ఈ లేఖ చేరింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయానికి నేరుగా ఇలాంటి లేఖ రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.మంత్రి పీఏ (PA) ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ లేఖ నిజంగా మావోయిస్టులే రాశారా? లేక మరెవరైనా కావాలనే బెదిరించేందుకు రాశారా? అనే దానిపై నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నాయి. సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ మరియు పోస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఈ ఘటన నేపథ్యంలో మంత్రి నివాసం మరియు ఆయన పర్యటనల వద్ద పోలీసు భద్రతను మరింత పెంచే అవకాశం ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి