Breaking News

బెయిల్‌పై విడుదల.. మర్నాడే జైలు


Published on: 16 May 2025 12:28  IST

కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కె. ఆనందరావు అక్రమ ఆస్తుల కేసులో మళ్లీ అరెస్టయ్యారు.గ్యాస్‌ ఏజెన్సీ లైసెన్స్‌ పేరుమార్పుకు రూ.లక్ష లంచం తీసుకున్న కేసులో ఆయన మార్చిలోనే అరెస్టయ్యారు.ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆనందరావుపై తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. కాకినాడ, నిజామాబాద్‌, వనస్థలిపురం సహా అనేక ప్రాంతాల్లో ఆయన బంధువుల ఇళ్లపై అనిశా సోదాలు నిర్వహించింది.ఆ ఆధారాలతో గురువారం మరోసారి అరెస్టు చేసి రాజమహేంద్రవరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.

Follow us on , &

ఇవీ చదవండి