Breaking News

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌


Published on: 11 Feb 2026 12:07  IST

రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల్లో బుధవారం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,188 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, ప్రతి పోలింగ్‌ కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తామని వెల్లడించారు.ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా బృందాలు చూసుకుంటాయని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి