Breaking News

నరవణే పుస్తకంపై..పొంతన లేని వివరణలు!


Published on: 11 Feb 2026 12:12  IST

మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం. నరవణే పుస్తకం ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై ఆ పుస్తక ప్రచురణకర్త ‘పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా’ 24 గంటల్లో రెండోసారి వివరణ ఇచ్చింది. ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని పేర్కొంది. తాజాగా ఇచ్చిన ప్రకటనలో.. విడుదల కాబోతున్న పుస్తకం(ఎనౌన్సౌడ్‌ బుక్‌), ప్రి ఆర్డర్‌కు అందుబాటులో ఉన్న పుస్తకం, పబ్లిష్డ్‌ పుస్తకం ఒకటి కాదని పేర్కొంది. 

Follow us on , &

ఇవీ చదవండి