Breaking News

ఎడాపెడా దోచేశారు


Published on: 11 Feb 2026 12:48  IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ అవినీతి బయటపడింది. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ వేల కోట్లు కొట్టేసిన విషయం వెలుగుచూసింది. ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణంలో అడ్వాన్స్‌ పేరుతో కాంట్రాక్టర్లు ముందస్తుగా డబ్బు తీసుకున్నారు. కమీషన్ల కక్కుర్తితో అధికారులు వారికి సహకరించారు. ఇద్దరూ కుమ్మక్కై భారీగా దోచేసి చివరికి ఇళ్లు నిర్మించకుండానే వదిలేశారు. ఈ వ్యవహారాన్నంతటినీ క్షుణ్ణంగా పరిశీలించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక రాష్ట్ర గృహనిర్మాణ శాఖలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి