Breaking News

నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు..


Published on: 11 Feb 2026 13:59  IST

తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కాంట్రాక్టు ఉద్యోగి తంబూరు రాధాకృష్ణపై వేటు పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి వెళ్లే నెయ్యి ట్యాంకర్ల నుంచి లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు తిరుచానూరు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి హరికిషోర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాధాకృష్ణ వైసీపీ హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచి రూ.3.68 లక్షలు లంచంగా వసూలు చేశాడు. తిరుపతిలోని అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద మాటు వేసి ఈ దందా నడిపాడు.

Follow us on , &

ఇవీ చదవండి