Breaking News

ప్రాణం తీసిన కేబుల్‌


Published on: 11 Feb 2026 14:05  IST

కేబుల్‌ సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ ప్రాధానోపాధ్యాయుడి ప్రాణాలను బలి తీసుకుంది. రోడ్డుకు అడ్డంగా వేలాడిన కేబుల్‌ బైక్‌పై వెళ్తున్న ఆయన మెడకు చుట్టుకోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా, చీరాల మండలం గవినివారిపాలెం సమీపంలో మంగళవారం దుర్ఘటన చోటుచేసుకొంది. పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన అంగిరేకుల శ్రీనివాసరావు (58) గవినివారిపాలెం జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.బాపట్లలో స్థిరపడిన ఆయన నిత్యం ద్విచక్రవాహనంపై గవినివానిపాలేనికి వచ్చి వెళ్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి