Breaking News

సమ్మర్‌ డిమాండ్‌ షురూ..


Published on: 11 Feb 2026 15:06  IST

నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్‌ డిమాండ్‌ మొదలైందని, వేసవిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. ఖైరతాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధానకార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లపై లోడ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు.33కేవీ ఫీడర్లపై 300 యాంప్స్‌, 11 కేవీ ఫీడర్లపై 150యాంప్స్‌ లోడ్‌ మించకుండా చూడాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి