Breaking News

మార్చి 7వరకు అసెంబ్లీ సమావేశాలు..


Published on: 11 Feb 2026 17:23  IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం గం.9:00 నుంచి మధ్యాహ్నం గం.1:30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 14న బడ్జెట్ సమావేశం నిర్వహించనుంది. 15, 16న సెలవులు కాబట్టి 17, 18వ తేదీల్లో బడ్జెట్‌పై చర్చ, 18న రాష్ట్ర పద్దుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఉంటుంది.అసెంబ్లీ సమావేశాల్లో రోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి