Breaking News

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు


Published on: 11 Feb 2026 17:24  IST

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఆది, గురు, శుక్రవారాల్లో రామేశ్వరం(Rameswaram ) నుండి తిరుపతికి, అలాగే సోమ, శుక్ర, శనివారాల్లో తిరుపతి(Tirupati) నుండి రామేశ్వరానికి వారానికి మూడు రోజులు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లలో రద్దీ పెరిగిన దృష్ట్యా ఇకపై అదనంగా ఒకరోజు రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి