Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు..


Published on: 11 Feb 2026 17:32  IST

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు, నినాదాలు, దొంగ ఓట్ల యత్నాలు వంటి ఘటనలు వెలుగుచూశాయి. పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి