Breaking News

మహా శివరాత్రికి 2,243 ప్రత్యేక బస్సులు..


Published on: 11 Feb 2026 18:23  IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. శివరాత్రి సందర్భంగా వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి పండుగ ఉండటంతో.. ఈనెల 14 నుంచి 16 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి