Breaking News

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.ఉదిత్ నారాయణ్ మొదటి భార్య రంజనా ఝా (Ranjana Jha), తనకు తెలియకుండానే తన గర్భాశయాన్ని (uterus) తొలగింపజేశారని సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Published on: 12 Feb 2026 14:48  IST

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.ఉదిత్ నారాయణ్ మొదటి భార్య రంజనా ఝా (Ranjana Jha), తనకు తెలియకుండానే తన గర్భాశయాన్ని (uterus) తొలగింపజేశారని సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్స పేరుతో 1996లో ఉదిత్ నారాయణ్, ఆయన ఇద్దరు సోదరులు మరియు రెండో భార్య దీపా నారాయణ్ కలిసి తనపై ఈ కుట్ర పన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

బీహార్‌లోని సుపాల్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో రంజనా ఝా ఈ ఫిర్యాదును నమోదు చేశారు. ఆయన తనకు సరిగ్గా భరణం చెల్లించడం లేదని, భార్యగా తనకు రావాల్సిన గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై ఉదిత్ నారాయణ్ నుండి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి