Breaking News

జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసు స్టేషన్‌లో కేసు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా (ఫిబ్రవరి 11) సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Published on: 12 Feb 2026 18:29  IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా (ఫిబ్రవరి 11) సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆయనపై బీఎస్ఎస్ (BSS) యాక్ట్ కింద 223, 351, 352, 132, 329 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ చేశారు.పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ శివకుమార్‌తో పాటు ఇతర పోలీసు అధికారులను దూషించారని, వారిపై దాడికి ప్రయత్నించి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు పేర్కొన్నారు.

దొంగ ఓట్లను అడ్డుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కాలర్‌ను సీఐ పట్టుకున్నారని, అందుకే తాను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. సీఐ బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.దీనికి అదనంగా, ఫిబ్రవరి 10న సదాశివపేటలోని ఒక హోటల్ వద్ద డబ్బులు పంచుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణపై కూడా ఆయనపై గతంలోనే సదాశివపేట పీఎస్‌లో కేసు నమోదైంది. 

Follow us on , &

ఇవీ చదవండి