Breaking News

పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవదహనం

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 24, 2026న అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట్ ప్రాంతంలో ఒక తల్లి తన రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. 

Published on: 24 Feb 2026 18:56  IST

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 24, 2026న అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట్ ప్రాంతంలో ఒక తల్లి తన రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. 

బిహార్‌కు చెందిన ఒక వలస కూలీ కుటుంబం బౌరంపేట్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ వద్ద నివసిస్తోంది.మంగళవారం ఉదయం, ఆ తల్లి తన రెండు నెలల కుమారుడిని కాళ్లు, చేతులు కట్టేసి, ఏడుపు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. అనంతరం చిన్నారిని కట్టెల పొయ్యిలో వేసి తగలబెట్టి చంపేసింది.బాబు నిన్న రాత్రి నుంచి నిరంతరంగా ఏడుస్తున్నాడని, ఆ ఏడుపు భరించలేక ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం.

శిశువు మరణంతో తండ్రి ఆమెతో గొడవకు దిగగా, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి