Breaking News

రాజంపేట దీప్ లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం

కడప జిల్లా రాజంపేటలోని దీప్ లాడ్జిలో బుధవారం అర్ధరాత్రి (ఫిబ్రవరి 25, 2026 అర్ధరాత్రి దాటిన తర్వాత) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 


Published on: 26 Feb 2026 19:14  IST

కడప జిల్లా రాజంపేటలోని దీప్ లాడ్జిలో బుధవారం అర్ధరాత్రి (ఫిబ్రవరి 25, 2026 అర్ధరాత్రి దాటిన తర్వాత) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రాజంపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జి.బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.లాడ్జిలోని సుమారు 22 గదులకు మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో గదుల్లో ఉన్నవారు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. 

ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు (వెంకట శ్రీనివాస్) అనే వ్యక్తి ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు.ప్రమాద సమయంలో లాడ్జిలో సుమారు 33 నుంచి 39 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సకాలంలో స్పందించి, కిటికీలు, తలుపులు పగలగొట్టి సుమారు 32 మందిని సురక్షితంగా బయటకు తీశారు.పొగ కారణంగా అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి