Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న భట్టి విక్రమార్క

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 27, 2026 (శుక్రవారం) నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 

Published on: 27 Feb 2026 15:10  IST

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 27, 2026 (శుక్రవారం) నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 

ఆలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మరియు అర్చకులు ఘనస్వాగతం పలికారు.భట్టి విక్రమార్క అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు.

ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహూకరించారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement