Breaking News

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై ఆరా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 ఫిబ్రవరి 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు.


Published on: 28 Feb 2026 14:14  IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 ఫిబ్రవరి 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో ఈ భేటీ జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులపై సీఎం లోతైన విశ్లేషణ చేశారు.తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా కొందరు నాయకుల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆరుగురు ఎమ్మెల్యేలు మరియు ఇద్దరు నియోజకవర్గ ఇన్ఛార్జులు పాల్గొన్నారు.ఫిబ్రవరి 25న మార్కాపురంలో పర్యటించిన సందర్భంగా, వెలిగొండ ప్రాజెక్టును 2026 జూలై నాటికి పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి