Breaking News

కాకినాడ జిల్లా సామర్లకోటలోని వేట్లపాలెం-జి. మేడుపాడు మధ్య గల బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం-జి. మేడుపాడు మధ్య గల బాణసంచా తయారీ కేంద్రంలో ఫిబ్రవరి 28, 2026 (శనివారం) నాడు భారీ పేలుడు సంభవించింది.


Published on: 28 Feb 2026 18:50  IST

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం-జి. మేడుపాడు మధ్య గల బాణసంచా తయారీ కేంద్రంలో ఫిబ్రవరి 28, 2026 (శనివారం) నాడు భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 18 మందికి పైగా మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరికొన్ని నివేదికల ప్రకారం ఆరుగురు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రులకు తరలించారు.

పేలుడు ధాటికి మృతదేహాలు సమీపంలోని పంట పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ఐదు గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది  స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా దాదాపు 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.కార్మికులు బాణసంచా తయారు చేస్తున్న సమయంలో మందుగుండు సామాగ్రికి నిప్పు అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి