Breaking News

పెళ్లి జరిగిన నాలుగు రోజులకే ఆత్మహత్య

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని జోగిండ్ల గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.కమ్మనపల్లె పంచాయతీ జోగిండ్ల గ్రామానికి చెందిన జె. మురళి (30). ఈయన స్థానిక సీఎస్‌సీ (CSC) కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు.

Published on: 02 Mar 2026 10:31  IST

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని జోగిండ్ల గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.కమ్మనపల్లె పంచాయతీ జోగిండ్ల గ్రామానికి చెందిన జె. మురళి (30). ఈయన స్థానిక సీఎస్‌సీ (CSC) కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు.

ఫిబ్రవరి 25న ఇచ్చాపురానికి చెందిన సుజాతతో మురళికి రెండవ వివాహం జరిగింది.వివాహం జరిగిన నాలుగు రోజులకే, ఫిబ్రవరి 28వ తేదీన పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన మురళి తిరిగి రాలేదు. మార్చి 1 (ఆదివారం) సాయంత్రం బైరెడ్డిపల్లె సమీపంలోని దర్గా వద్ద ఉన్న పెద్దచెరువులో మురళి మృతదేహం లభ్యమైంది.చెరువు గట్టుపై మురళి చెప్పులను గుర్తించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెళ్లయిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి