Breaking News

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించిన త్రిపుర సీఎం

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం (మార్చి 1, 2026) తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామినితన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. 


Published on: 02 Mar 2026 12:29  IST

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం (మార్చి 1, 2026) తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామినితన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి కార్యనిర్వహణాధికారి (EO) టి. బాపిరెడ్డి మరియు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.

సీఎం మాణిక్ సాహా దంపతులు ఆలయంలోని అంతరాలయ దర్శనం చేసుకుని, శ్రీకాళహస్తీశ్వర స్వామికి మరియు జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి కుటుంబానికి వేద ఆశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గుర్రపుశెట్టి మరియు లక్ష్మమ్మ, అసిస్టెంట్ ఈవో విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Follow us on , &

ఇవీ చదవండి