Breaking News

బెలూన్ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

గుంటూరు జిల్లా పెదకాకానిలో ఈరోజు (మార్చి 4, 2026) ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. 


Published on: 04 Mar 2026 16:09  IST

గుంటూరు జిల్లా పెదకాకానిలో ఈరోజు (మార్చి 4, 2026) ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పెదకాకానికి చెందిన శిరీష (4)అనే చిన్నారి.చిన్నారి తన ఇంట్లో బెలూన్ ఊదుతూ ఆడుకుంటుండగా, అది అకస్మాత్తుగా గొంతులోకి వెళ్లి అడ్డుపడింది.

బెలూన్ గొంతులో చిక్కుకోవడంతో శ్వాస ఆడక ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.కుటుంబ సభ్యులు వెంటనే బాలికను గుంటూరు సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు.చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనతో పెదకాకానిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి