Breaking News

తిరుమల లడ్డూ అంశంపై మంత్రి ఆనం ప్రకటన

నేడు (మార్చి 4, 2026) ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపైకి వైకాపా (YSRCP) ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు దూసుకెళ్లారు. 

Published on: 04 Mar 2026 17:31  IST

నేడు (మార్చి 4, 2026) ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపైకి వైకాపా (YSRCP) ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు దూసుకెళ్లారు. 

తిరుమల లడ్డూ అంశంపై మంత్రి ఆనం ప్రకటన చేస్తున్నప్పుడు, వైకాపా ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియంను చుట్టుముట్టారు.చర్చ వేడెక్కిన క్రమంలో ఎమ్మెల్సీ మాధవరావు మంత్రి ఆనంపైకి దూసుకెళ్లగా, మంత్రి కూడా ఆగ్రహంతో "తేల్చుకుందాం రండి" అంటూ ఆయనకు ఎదురెళ్లారు.

ఇరు పక్షాల సభ్యులు ఆగ్రహంతో ఒకరిపైకి ఒకరు వెళ్లడంతో ఉద్రిక్తత పెరిగింది. కూటమి ఎమ్మెల్సీలు మంత్రి ఆనంకు మద్దతుగా నిలిచారు.చివరకు ఇతర మంత్రులు మరియు సభ్యులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు, దీనివల్ల పెను ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి