Breaking News

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్  బెంగళూరులో కిమ్స్ (KIMS) హాస్పిటల్ నూతన స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభించారు.

మార్చి 8, 2026 ఆదివారం నాడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్  బెంగళూరులో కిమ్స్ (KIMS) హాస్పిటల్ నూతన స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభించారు. 


Published on: 09 Mar 2026 12:21  IST

మార్చి 8, 2026 ఆదివారం నాడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్  బెంగళూరులో కిమ్స్ (KIMS) హాస్పిటల్ నూతన స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభించారు. బెంగళూరులోని మహాదేవపుర మరియు ఎలక్ట్రానిక్ సిటీలలో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్ నూతన సదుపాయాలను ఆయన ప్రారంభించారు.1983 మార్చి 20న తన తాతగారు దివంగత ఎన్టీ రామారావు గారు ఇదే ఆసుపత్రికి శంకుస్థాపన చేశారని, మళ్ళీ ఇన్నేళ్లకు అదే మార్చి నెలలో తాను ఇక్కడికి రావడం తన పూర్వజన్మ సుకృతమని తారక్ పేర్కొన్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా కోసం ఎన్టీఆర్ మార్చుకున్న కొత్త లుక్ ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంది.

తారక్‌ను చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో హాస్పిటల్‌లోని ఎస్కలేటర్ దెబ్బతింది మరియు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.ఒకవేళ డాక్టర్ అయితే ఏ స్పెషలిస్ట్ అయ్యేవారు అన్న ప్రశ్నకు, తనకు పిల్లలంటే ఇష్టం కాబట్టి పీడియాట్రిషియన్ అయ్యేవాడినని ఆయన సరదాగా సమాధానమిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి