Breaking News

కుమారుడితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

మార్చి 9, 2026న కాకినాడ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన.కాకినాడ జిల్లా  కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలోని 'తమ్మయ్య చెరువు'లో దూకి ఒక మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.


Published on: 10 Mar 2026 16:46  IST

మార్చి 9, 2026న కాకినాడ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన.కాకినాడ జిల్లా  కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలోని 'తమ్మయ్య చెరువు'లో దూకి ఒక మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.మృతులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెద్దబొద్దుపల్లి గ్రామానికి చెందిన వడిసెల భాగ్యలక్ష్మి (35)మరియు ఆమె కుమారుడు సాయి ఈషాన్ (3) గా గుర్తించారు.

భాగ్యలక్ష్మికి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన వడిసెల దుర్గాప్రసాద్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు నడుస్తున్నట్లు సమాచారం.మృతురాలి తల్లి నెల్లి రత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీసులు ఆమె భర్త మరియు అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి