Breaking News

కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది.

మహబూబ్‌నగర్ జిల్లా ఉండవల్లి శివారులో నేడు (మార్చి 10, 2026) ఒక కారు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఒక కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.


Published on: 10 Mar 2026 17:37  IST

మహబూబ్‌నగర్ జిల్లా ఉండవల్లి శివారులో నేడు (మార్చి 10, 2026) ఒక కారు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఒక కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.

గాయపడిన వారు కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన దంపతులు మద్దిలేటి, మన్నెమ్మ, వారి కుమారుడు నాగరాజు మరియు బంధువు కృష్ణవేణిగా గుర్తించారు.

వీరంతా కారులో ఉండవల్లి మండలం కంచుపాడులోని జమ్మలమ్మ ఆలయానికి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఎస్సై శేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి