Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. భయంతో పరుగులు


Published on: 19 May 2025 14:22  IST

సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. ఉదయం 08:54:18 గంటలకు ఇది సంభవించింది. దీని లాటిట్యూడ్ 36.41 N, లాంగిట్యూడ్ 70.94 E వద్ద, 140 కి.మీ లోతులో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ భూకంపం నాలుగు రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన నాలుగో భూకంపంగా నిలిచింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి సమాచారం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి