Breaking News

ఒడిశాలోని కటక్‌లో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఒడిశాలోని కటక్‌లో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో సోమవారం (16 మార్చి 2026) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది రోగులు మృతి చెందగా, మరో 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడ్డారు. 

Published on: 16 Mar 2026 10:17  IST

ఒడిశాలోని కటక్‌లో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో సోమవారం (16 మార్చి 2026) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది రోగులు మృతి చెందగా, మరో 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడ్డారు. 

సోమవారం తెల్లవారుజామున సుమారు గంటలు 2:30 - 3:00 మధ్య ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూ (Trauma Care ICU) లో మంటలు చెలరేగాయి.ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురు రోగులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఇతర వార్డులకు తరలిస్తుండగా చనిపోయారు. రోగులను రక్షించే క్రమంలో 11 మంది సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏసీ (Air Conditioning) సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ (Mohan Charan Majhi) ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ₹25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా సమీప వార్డుల్లోని సుమారు 23 మంది రోగులను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement