Breaking News

విశాఖలో బాణసంచా పేలుడు తప్పిన ప్రమాదం

విశాఖపట్నంలోని  గోపాలపట్నం ప్రాంతంలో మార్చి 15, 2026 ఆదివారం రాత్రి బాణసంచా నిల్వలు ఉన్న ఒక భవనంలో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


Published on: 16 Mar 2026 10:45  IST

విశాఖపట్నంలోని  గోపాలపట్నం ప్రాంతంలో ఆదివారం రాత్రి బాణసంచా నిల్వలు ఉన్న ఒక భవనంలో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజకా వీధి, ఎర్రచెరువు మరియు ఆదర్శనగర్ ప్రాంతం.ఒక భవనం పై అంతస్తులో నిల్వ ఉంచిన బాణసంచా మరియు మందుగుండు సామాగ్రి ఒక్కసారిగా పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. పేలుడు ధాటికి భవన శిథిలాలు వీధుల్లోకి ఎగిరిపడ్డాయి.

ఆదివారం సాయంత్రం 5:30 నుండి 6:00 గంటల మధ్య భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భీతావహానికి గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.గోపాలపట్నం పోలీసులు స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ భవనంలో అనుమతి లేకుండా అక్రమంగా బాణసంచా మరియు గన్‌పౌడర్ తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.స్థానిక యువకులు మరియు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో భారీ ముప్పు తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement