Breaking News

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ఆవిష్కరించారు. 

తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు, 2026 మార్చి 16న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ఆవిష్కరించారు. 


Published on: 16 Mar 2026 13:54  IST

తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు, 2026 మార్చి 16 రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ఆవిష్కరించారు. 

అసెంబ్లీ ప్రాంగణంలోని పునరుద్ధరించిన శాసనమండలి భవనం ముందు ఈ విగ్రహాన్ని కొలువుదీర్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ ఆవిష్కరణ మహోత్సవం జరిగింది.విగ్రహావిష్కరణకు ముందు గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర నేతలు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ప్రభుత్వం రూపొందించింది.

నేటి నుంచే (మార్చి 16) తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభానికి ముందే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి