Breaking News

పాలకుర్తి రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై మంగళవారం (17 మార్చి 2026) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడ్ల శ్రీనివాస్ (43) మరియు ఆయన భార్య రజిత (42) అక్కడికక్కడే మృతి చెందారు. 

Published on: 17 Mar 2026 14:11  IST

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై మంగళవారం (17 మార్చి 2026) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడ్ల శ్రీనివాస్ (43) మరియు ఆయన భార్య రజిత (42) అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతులు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందినవారు. శ్రీనివాస్ మంచిర్యాల లయన్స్ క్లబ్ మరియు క్రెడాయ్ (CREDAI) సభ్యునిగా కొనసాగుతున్నారు.హైదరాబాద్‌లో చదువుకుంటున్న తమ కుమార్తె రిషితను చూసి తిరిగి కారులో మంచిర్యాలకు వస్తుండగా, బసంత్ నగర్ బస్టాండ్ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది.సమాచారం అందుకున్న బసంత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి