Breaking News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ. 18,000 కోట్ల భారీ కుంభకోణం ఆరోపణలు చేశారు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు, 17 మార్చి 2026న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ. 18,000 కోట్ల భారీ కుంభకోణం ఆరోపణలు చేశారు


Published on: 17 Mar 2026 17:47  IST

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు, 17 మార్చి 2026న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ. 18,000 కోట్ల భారీ కుంభకోణం ఆరోపణలు చేశారు. 

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో చేపట్టే రోడ్ల పనుల్లో ఈ కుంభకోణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందులో రోడ్లు & భవనాల (R&B) శాఖలో రూ. 12,000 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖలో రూ. 6,000 కోట్ల మేర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.

గతంలో ఇవే అడ్వాన్స్‌లను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తన ప్రభుత్వంలో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తున్నారని, దీని ద్వారా దాదాపు రూ. 1,800 కోట్లు నేరుగా కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి వెళ్తున్నాయని మండిపడ్డారు.

టెండర్లను అంచనాల కంటే 15-20% అధిక ధరలకు కట్టబెడుతున్నారని, టెండర్ల కమిటీ (COT) అనుమతి లేకుండానే ఈ ప్రక్రియ సాగుతోందని హరీష్ రావు విమర్శించారు.

ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) మరియు ఆర్బీఐ (RBI)లకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి