Breaking News

తాడిపత్రిలో ఒక నవ వధువు ఆత్మహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 18 మార్చి 2026న ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చోటుచేసుకుంది.లక్ష్మీప్రసన్న (30). ఆమె తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేసేవారు.


Published on: 18 Mar 2026 15:16  IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 18 మార్చి 2026న ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చోటుచేసుకుంది.లక్ష్మీప్రసన్న (30). ఆమె తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేసేవారు.ఆమెకు గత నెలలో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్‌తో వివాహం జరిగింది.తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలో ఉన్న తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.

పెళ్లికి ముందే ఆమె ఒకసారి డిప్రెషన్ (కుంగుబాటు) కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు, అప్పట్లో తల్లిదండ్రులు ఆమెను కాపాడినట్లు సమాచారం. గురువారం ఆమె తన అత్తగారింటికి వెళ్లాల్సి ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టారు.మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement