Breaking News

గాజువాక సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి  గోపీచంద్

మార్చి 23, 2026, సోమవారం నాడు సినీ నటుడు గోపీచంద్ విశాఖపట్నంలోని షీలా నగర్ ప్రాంతంలో ఉన్న గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విచ్చేశారు.


Published on: 23 Mar 2026 19:31  IST

మార్చి 23, 2026, సోమవారం నాడు సినీ నటుడు గోపీచంద్ విశాఖపట్నంలోని షీలా నగర్ ప్రాంతంలో ఉన్న గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విచ్చేశారు. గాజువాక సమీపంలోని మింది ప్రాంతంలో ఉన్న తన సొంత స్థలాన్ని అభివృద్ధి (Development) చేసేందుకు ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకునే నిమిత్తం ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు.ఆన్‌లైన్ ద్వారా ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లు, కేవలం 10 నిమిషాల్లోనే బయోమెట్రిక్ సహా అన్ని పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.సబ్ రిజిస్ట్రార్ తారకేసు మరియు కార్యాలయ సిబ్బంది గోపీచంద్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

గోపీచంద్ రాకతో కార్యాలయానికి వచ్చిన ఇతర వినియోగదారులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.

Follow us on , &

ఇవీ చదవండి