Breaking News

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలోని ఒక ఇంధన ట్యాంకర్పై డ్రోన్ నేరుగా పడటంతో భారీగా మంటలు

25 మార్చి 2026, బుధవారం తెల్లవారుజామున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక ఇంధన ట్యాంకర్ (Fuel Tank) పై డ్రోన్ నేరుగా పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. 

Published on: 25 Mar 2026 10:37  IST

25 మార్చి 2026, బుధవారం తెల్లవారుజామున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక ఇంధన ట్యాంకర్ (Fuel Tank) పై డ్రోన్ నేరుగా పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. 

ఈ దాడి వల్ల ఇంధన ట్యాంకర్ పేలి భారీగా పొగ వ్యాపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేవలం ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లిందని, ప్రాణాపాయం లేదా గాయాలు ఎవరికీ కాలేదని అధికారులు ధృవీకరించారు.విమానాశ్రయ అధికారులు వెంటనే అత్యవసర ప్రోటోకాల్స్‌ను అమలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కువైట్ నేషనల్ గార్డ్ బుధవారం తెల్లవారుజామున సుమారు 6 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థల ద్వారా కూల్చివేసినట్లు ప్రకటించింది. స్థానికులు భారీ పేలుడు శబ్దాలు విన్నట్లు వార్తా సంస్థలు నివేదించాయి.విమానాశ్రయ కార్యకలాపాలపై స్పష్టత వచ్చే వరకు ప్రజలు అధికారిక భద్రతా సూచనలను పాటించాలని కువైట్ పౌర విమానయాన సంస్థ (DGCA) కోరింది. 

Follow us on , &

ఇవీ చదవండి