Breaking News

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు, మార్చి 31, 2026న భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 


Published on: 31 Mar 2026 12:59  IST

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు, మార్చి 31, 2026న భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కోల్‌కతాలో బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్ సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు పేస్ పార్టీలో చేరారు.

పేస్ గతంలో 2021లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. అయితే, తాజాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.రాబోయే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆయన కీలక ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.పేస్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు, కానీ ఆయనకు సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement