Breaking News

మాచర్ల అత్యాచార ఘటన నిందితుడికి రిమాండ్‌

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడు నామాల శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 


Published on: 09 Apr 2026 17:27  IST

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడు నామాల శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. నిందితుడు శ్రీనును బుధవారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు, నేడు ఉదయం మాచర్ల కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు.విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో, పోలీసులు అతడిని గురజాల సబ్ జైలుకు తరలించారు.మొదట గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని భావించినప్పటికీ, నిందితుడు బాధితురాలికి పరిచయస్తుడైన ప్రియుడేనని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నిందితుడిని రాజుపాలెం మండలానికి చెందిన శ్రీనివాస్‌గా ధృవీకరించారు.

ఈ నెల ప్రారంభంలో మంచినీళ్ల సాకుతో ఇంట్లోకి చొరబడి, బాధితురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, ఆమెను తీవ్రంగా గాయపరిచినట్లు అభియోగాలు ఉన్నాయి

Follow us on , &

ఇవీ చదవండి