Breaking News

హుబ్బళ్లి నుంచి మైసూరు వెళ్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 16591) రైలులో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి

హుబ్బళ్లి నుంచి మైసూరు వెళ్తున్న హంపీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 16591) రైలులో ఏప్రిల్ 8, 2026 బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి.బళ్లారి జిల్లాలోని హగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.


Published on: 10 Apr 2026 19:38  IST

హుబ్బళ్లి నుంచి మైసూరు వెళ్తున్న హంపీ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 16591) రైలులో ఏప్రిల్ 8, 2026 బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి.బళ్లారి జిల్లాలోని హగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు బలంగా పట్టేయడం వల్ల చక్రాలు, పట్టాల మధ్య ఏర్పడిన తీవ్ర రాపిడి (friction) కారణంగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కూడా కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.ఏప్రిల్ 8, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు కనిపించగానే రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు.బోగీల్లోకి పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై రైలు దిగి పరుగులు తీశారు.మంటలను ఆర్పిన తర్వాత రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది. 

Follow us on , &

ఇవీ చదవండి