Breaking News

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రస్తుతం సైంటిస్ట్-B, C మరియు D విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ల విడుదల

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రస్తుతం సైంటిస్ట్-B, C మరియు D విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేసింది.


Published on: 16 Apr 2026 17:28  IST

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రస్తుతం సైంటిస్ట్-B, C మరియు D విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేసింది.

సైంటిస్ట్-B పోస్టులు (243 ఖాళీలు

ఈ పోస్టులకు గేట్ (GATE) స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

మొత్తం ఖాళీలు: 243 (కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో).

అర్హత: B.E / B.Tech / M.Sc / MCA / M.E / M.Tech పూర్తి చేసి ఉండాలి. ఖచ్చితంగా GATE (2024/2025/2026) వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.

జీతం: నెలకు ₹56,100 నుండి ₹1,77,500 వరకు (పే లెవల్ 10).

చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ 24, 2026 ఆఖరు తేదీ. 

సైంటిస్ట్-C మరియు D పోస్టులు (153 ఖాళీలు)

ఈ పోస్టులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

మొత్తం ఖాళీలు: 153 (సైంటిస్ట్-C: 12, సైంటిస్ట్-D: 141).

అర్హత: B.E / B.Tech / M.Sc / MCA తో పాటు నిర్ణీత పని అనుభవం (Scientist-C కి 4 ఏళ్లు, Scientist-D కి 8 ఏళ్లు) తప్పనిసరి.

వయోపరిమితి: సైంటిస్ట్-C కి 35 ఏళ్లు, సైంటిస్ట్-D కి 40 ఏళ్లు మించకూడదు.

జీతం:

సైంటిస్ట్-C: ₹67,700 – ₹2,08,700.

సైంటిస్ట్-D: ₹78,800 – ₹2,09,200.

చివరి తేదీ: దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 30, 2026 వరకు సమయం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి