Breaking News

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు, అక్రమాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏప్రిల్ 15, 2026 బుధవారం సాయంత్రం నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు వివిధ మీసేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.


Published on: 16 Apr 2026 17:57  IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు, అక్రమాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏప్రిల్ 15, 2026 బుధవారం సాయంత్రం నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు వివిధ మీసేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడులు గురువారం (ఏప్రిల్ 16, 2026) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. 

కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేయడం (Overcharging), దళారుల ప్రమేయం, మరియు సేవల్లో జాప్యంపై అందిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు జరిగాయి.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, సరూర్ నగర్, అల్వాల్, ఖైరతాబాద్‌తో పాటు మెదక్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో సుమారు 20కి పైగా టీమ్స్ ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.సోదాల సమయంలో సెంటర్లలోని నగదు నిల్వలు, పెండింగ్ దరఖాస్తుల జాబితా, కంప్యూటర్లు, మరియు సిబ్బంది మొబైల్ ఫోన్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తూ, నేరుగా వచ్చే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి