Breaking News

గోపాలపేటలో కోనేరులో స్నానానికి దిగి మృతి

వనపర్తి జిల్లా గోపాలపేటలోని కోదండరామస్వామి దేవాలయం ముందున్న కోనేరులో స్నానానికి దిగి శ్రీనివాసులు (30) అనే వ్యక్తి మృతి చెందారు. ఆదివారం (ఏప్రిల్ 19, 2026) సాయంత్రం శ్రీనివాసులు కోనేరులో స్నానానికి వెళ్లారు.

Published on: 20 Apr 2026 16:06  IST

వనపర్తి జిల్లా గోపాలపేటలోని కోదండరామస్వామి దేవాలయం ముందున్న కోనేరులో స్నానానికి దిగి శ్రీనివాసులు (30) అనే వ్యక్తి మృతి చెందారు. ఆదివారం (ఏప్రిల్ 19, 2026) సాయంత్రం శ్రీనివాసులు కోనేరులో స్నానానికి వెళ్లారు.

ఆ సమయంలో ఆయన గల్లంతయ్యారు.సోమవారం (ఏప్రిల్ 20, 2026) ఉదయం వనపర్తి ఫైర్ సిబ్బంది కోనేరు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు.స్నానానికి దిగిన సమయంలో శ్రీనివాసులుకు ఒక్కసారిగా ఫిట్స్ (మూర్ఛ) రావడంతో నీటిలో మునిగిపోయారని గోపాలపేట ఎస్సై జగన్మోహన్ తెలిపారు.మృతుడికి భార్య మరియు ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement