Breaking News

హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్ రైతుల ఆందోళన

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతులు 21 ఏప్రిల్ 2026న హైదరాబాద్‌లో భారీ ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో రైతులు ధర్నా చేపట్టారు.

Published on: 21 Apr 2026 18:11  IST

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతులు 21 ఏప్రిల్ 2026న హైదరాబాద్‌లో భారీ ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో రైతులు ధర్నా చేపట్టారు.

ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ (ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్) యజమాని తమను కోట్ల రూపాయల మేర మోసం చేశారని రైతులు ఆరోపించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు వచ్చిన పరిహారం డబ్బును ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టారు.

నెలకు రూ.2 వడ్డీ ఇస్తామని నమ్మించి, సుమారు 25 గ్రామాలకు చెందిన 2,500 మంది రైతుల నుండి దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.యజమాని ధనుంజయ్ గుప్తా అసలు, వడ్డీ చెల్లించకుండా మొహం చాటేశారని రైతులు ఆరోపిస్తూ ఆయన ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement