Breaking News

ముత్తోజిపేట గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యుల ఏర్పాట్లు

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మృతదేహం ఏప్రిల్ 24, 2026 శుక్రవారం ఉదయం ఆయన అల్లుడిస్వగ్రామమైన ముత్తోజిపేటకు చేరుకుంది.


Published on: 24 Apr 2026 16:14  IST

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మృతదేహం ఏప్రిల్ 24, 2026 శుక్రవారం ఉదయం ఆయన అల్లుడిస్వగ్రామమైన ముత్తోజిపేటకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదనే ఆవేదనతో గురువారం (ఏప్రిల్ 23) నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

80 శాతానికి పైగా కాలిన గాయాలతో హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఆయన కన్నుమూశారు.పోస్ట్‌మార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామానికి తరలించారు.

ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.శంకర్ గౌడ్ మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నేతలు మరియు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది.

శంకర్ గౌడ్‌కు భార్య (లత), కుమారుడు (హేమంత్), మరియు కుమార్తె (శ్యామిలి) ఉన్నారు. ఆయన భార్య అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి