Breaking News

కర్నూలు జిల్లాలో ఒక యువకుడు దారుణహత్య

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ 24, 2026న ఒక యువకుడు దారుణ హత్యకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.


Published on: 24 Apr 2026 18:13  IST

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ 24, 2026న ఒక యువకుడు దారుణ హత్యకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.ఓర్వకల్లు మండలం, ఉయ్యాలవాడ గ్రామం.గ్రామంలో జరుగుతున్న తిరుణాళ్లలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో వంశీ, మధు అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. మనోజ్ (మధు సోదరుడు) జోక్యం చేసుకుని వారిని మందలించి, తన తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లాడు.

మనోజ్ మందలించాడన్న కోపంతో వంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి మనోజ్ ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ క్రమంలో వంశీ తన వెంట తెచ్చుకున్న కత్తితో మనోజ్‌పై దాడి చేయగా, తీవ్ర గాయాలైన మనోజ్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి